Header Banner

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

  Sun May 04, 2025 20:57        Politics

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత నెల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న హెలికాప్టర్ ధ్వంసం ఘటనకు సంబంధించి 10 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒక స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు ధర్మవరం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఏప్రిల్ 8న శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన పార్టీకి చెందిన బీసీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాపిరెడ్డిపల్లి గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లారు. ఆ సమయంలో హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని కొందరు కార్యకర్తలు హెలికాప్టర్ వద్దకు దూసుకువచ్చారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో భారీ వర్షాలు - కలెక్టర్లు, ఎస్పీల్ని అలర్ట్ చేసిన హోంమంత్రి.. పలు ప్రాంతాల్లో..

 

ఈ క్రమంలో జరిగిన తోపులాటలో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ (ముందు అద్దం) దెబ్బతిన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామంతో జగన్ తన పర్యటనను ముగించుకుని రోడ్డు మార్గంలో బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి మొత్తం 19 మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 10 మందిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌లకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపినట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, హెలికాప్టర్ పైలట్, కో-పైలట్‌లను ఏప్రిల్ 16న విచారణకు పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి సురక్షితం కానప్పుడు తిరిగి ఎలా వెళ్లారని వారిని ప్రశ్నించినట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్ అద్దం నిజంగా పగిలిందా అనే దానిపై పోలీసులకు ముందు నుంచి కొన్ని సందేహాలున్నట్లు తెలిసింది.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #AndhraPradesh #YCPOffice #Notes #APNews #APpolitics